మంత్రి కేటీఆర్‌ను కలిసిన మంచు మనోజ్ …కారణం ఏంటో తెలుసా ?

మంత్రి కేటీఆర్‌ను కలిసిన మంచు మనోజ్ ...కారణం ఏంటో తెలుసా ?

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆదివారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాను త్వరలో ప్రారంభించబోయే ఓ ప్రాజెక్టు గురించి మంత్రికి చెప్పారు. అయితే, ఆ ప్రాజెక్టుకు కేటీఆర్‌ తన మద్దతు ప్రకటించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన మంచు మనోజ్.

అది ఏమనగా ఒక పెద్ద, గొప్ప కార్యం మొదలు కానుందని.. తన కొత్త ప్రాజెక్టు, స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుటైన్‌మెంట్‌ ద్వారా యువతకు, సీనియర్లకు సాయం చేయాలనుకునే ఆలోచనను కేటీఆర్‌ గారితో పంచుకున్నానని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌ను కలవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని మనోజ్ అన్నారు. దీనికి మద్దతిస్తున్నందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు .

అలాగే మంచు మనోజ్ చాల కాలం తరువాత ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆ సినిమా కోసం మనోజ్‌ ఏకంగా 15 కేజీల బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది.