ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలతో బిజీ బిజీగా ఉన్న నూతన ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కాస్తా విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై గెలిచి అధ్యక్ష పిఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్త ప్రణాళికలతో వచ్చిన మంచు విష్ణు వీటికి కాస్తా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టూర్‌కు ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు.
భార్యతో కలిసి విమానంలో వెళుతున్న వీడియోను ఇన్‌స్టా స్టోరీ పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య విరానిక గురించి ఆసక్తికర విషయం చెప్పాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేస్తూ.. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పాడు. అలాగే తన భార్య విరానికను చూపిస్తూ.. అవును తన హాట్ అంటూ విరానిక ఎప్పుడూ తన ఫోన్‌లో బిజీగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.