ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై మావోయిస్టుల దాడి తర్వాత వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మావోయిస్టులు టార్గెట్ కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాలు అదనుచూసి మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి. మావోయిస్టులు సైతం పోలీసులపై ప్రతీకార దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల ఓ పోలీస్ అధికారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మావోయిస్టులు ప్రజాకోర్టులో శిక్షించామంటూ కాల్చి చంపేశారు. శవాన్ని తీసుకొచ్చి నడిరోడ్డుపై పడేశారు. ఆ ఘటన మరువక ముందే పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారు.

ఈ రోజు దంతేవాడ జిల్లా గీడాం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టును భద్రతా దళాలు అంతమొందించాయి. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని మావోయిస్టు మిలీషియా సభ్యుడు రామ్‌చందర్ కీర్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి టెంట్, పిస్టల్, మరో రెండు యుధాలు, నక్సల్ సాహిత్యం, రోజువారీ అవసరాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ను దంతేవాడ ఎస్పీ ధ్రువీకరించారు. మావోయిస్టు మృతి చెందినట్లు తెలిపారు.