అనుమానమే పెనుభూతంలా మారిందా? పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో సర్పంచ్ కాల్చివేత

ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ తో చిక్కుకొనే అల్లాడిపోతుండే మరో పక్క అనుమానమనే పెను భూతం సమాజాన్ని దహించి వేస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని గాడ్చిరోలి జిల్లాలో మాజీ డిప్యూటీ సర్పంచ్‌ను మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ గా భావించి హత్య చేశారు. మహారాష్ట్రలోని గాడ్చిరోలి జిల్లాలోని మిర్చి తాలూకాల సమీపంలోని నవేజరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని 40 ఏళ్ల హిరలాల్ రామ్‌సే కల్లోగా గుర్తించారు.

అయితే ఆ గ్రామానికి వెలుపల పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన ఇతడు పోలీసు ఇన్ఫార్మర్.. కావున ఇతడికి తగిన శిక్ష పడింది అని ఒక లేఖ రాసి ఉంది. ఛత్తీస్ ఘడ్ పోలీసులు గత వారం రాజ్‌నందగావ్, కాంకర్లకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు కాంట్రాక్టర్లు మావోయిస్టులకు రేషన్, యూనిఫాం..ఇతర వస్తువులను అందించారని ఆరోపించారు. ఈ సమాచారాన్ని చేరవేయడంలో కల్లో పాత్ర ప్రముఖంగా ఉందని మావోయిస్టులు అనుమానిస్తున్నారు. కాగా సాయంత్రం వేల మావోయిస్టులు నవేజరి గ్రామానికి చేరుకుని కల్లోను తన నివాసం నుంచి బయటకు తీసుకువచ్చారు. అతడిని గ్రామం చివరకు తీసుకు వెళ్లి ఎవరు లేని సమయంలో కాల్చ చంపి పోలీసు.. ఇన్ఫార్మర్ అని చెప్పి కరపత్రాలతో పొదల్లో పడేశాడు. కాగా కొందరు స్థానికులు ఉదయం కల్లో మృతదేహం గ్రామం వెలుపల పడి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు కోర్చి దళం హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని మావోయిస్టులపై ఇండియన్ పినల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసారు