ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా భారీ ప్రణాళికలను రచించాడు. స్వంత క్రిప్టోకరెన్సీని నిర్మించాలనే జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం…డైమ్ డిజిటల్ కరెన్సీ అభివృద్ధిని పర్యవేక్షిస్తోన్న డైమ్ అసోసియేషన్‌కు చెందిన ఇన్వెస్టర్ల మూలధనాన్ని తిరిగి ఇచ్చేందుకు కంపెనీ సిద్దమైందని పేర్కొంది.
అంతేకాకుండా ఈ సంస్థ ఆస్తుల విక్రయం కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. ఇందులో పనిచేసిన ఇంజనీర్ల కోసం కొత్త గమ్యాన్ని కనుగొనడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఈ విషయంపై డైమ్ అసోసియేషన్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
ఈ వ్యవహారంపై మెటా కూడా స్పందించలేదు.జుకమ్ బర్గ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌ను ఒకానొక సమయంలో యూఎస్ కాంగ్రెస్ ముందు సమర్థించుకున్నాడు. స్వంత క్రిప్టోకరెన్సీ విషయంలో మార్క్ వెనకడుగు వేసేదిలేదంటూ మందుకు వెళ్లాడు. ఇప్పుడు అది కాస్త బెడిసి కొట్టింది.డైమ్ అసోసియేషన్‌లో జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ మూడింట ఒక వంతు వాటాలను కల్గి ఉంది.
మిగిలినది ఆండ్రీసెన్ హోరోవిట్జ్, యూనియన్ స్క్వేర్ వెంచర్స్, రిబ్బిట్ క్యాపిటల్ వంటి అసోసియేషన్ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. జుకర్‌బర్గ్ స్వంత క్రిప్గోకరెన్సీని జూన్ 2019లో మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి క్రిప్టోప్రాజెక్టు పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. ఆ సమయంలో డైమ్ డిజిటల్ కరెన్సీకి లిబ్రా అని నామకరణం కూడా చేశారు. యూఎస్ సెంట్రల్ బ్యాంకర్లు, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా లిబ్రా డిజిటల్ కరెన్సీ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఏర్పాడయని సమాచారం.