ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రికత్తలు, రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చుననే అమెరికా సంకేతాలు దేశీయ సూచీలను తీవ్ర నష్టాలోకి పడేశాయి. అమెరికా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం రోజున భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 10: 30 గంటల సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 1027 పాయింట్ల నష్టంతో 57,139 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ కూడా 304 పాయింట్ల నష్టంతో 17,071 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.అన్ని రంగాల సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సీక్వెంట్ సైంటిఫిక్, మహీంద్రా లైఫ్ స్పేస్, ఎక్సెల్ ఇండస్ట్రీస్, యూ ఫ్లెక్స్,టీసీఎన్‌ఎస్ క్లోతింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మెట్రోపోలీస్ హెల్త్‌కేర్, కేఆర్‌బీఎల్, జైన్ ఇరిగేషన్, అవంతి ఫీడ్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.