తెలంగాణలో ఓ ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేమంటే.. ఇప్పటివరకు మనం ప్రేమ విఫలమై ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. ఇది వింతగా ఉంది. అది ఎలాగంటే.. ముందే పెళ్లై.. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత.. మరో పెళ్లి కానీ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన మండలంలోని అంకుశాపూర్ గ్రామ పొలిమేరలో ఉగాది రోజున చోటు చేసుకుంది.
కాగజ్‌నగ ర్ రూరల్ ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… దహేగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన సంతోష్ (35), కాగజ్‌నగర్ మండలం కొత్తసార్సాల గ్రామానికి చెందిన యువతి డోకే శైలజ (20)లు బుధవారం తెల్ల వారుజామున అంకుశాపూర్ గ్రామం సమీపంలోని రిజర్వు ఫారెస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన జ్యోతితో సంతోష్‌కు ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లైంది. వీరికి 5సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఈ మధ్య కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామానికి చెందిన శైలజతో సంతోష్ ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నాడు. ఈ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.