వర్షపు నీటిలో చిక్కుకుని పెళ్లి కుమార్తె​ మృతి

వర్షపు నీటిలో చిక్కుకుని పెళ్లి కుమార్తె​ మృతి

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షం నవ వధువు ప్రాణం తీసింది. వర్షపు నీటిలో చిక్కుకుని పెళ్లి కుమార్తె​ మృతి చెందింది. ఆ వివరాలు.. కర్ణాటకకు చెందిన పెళ్లి బృందం వివాహం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. అయితే శుక్రవారం అర్థరాత్రి తిరుమలో కురిసిన భారీ వర్షానికి తిరుపతి బాలజీ కాలనీ నుంచి ఎమ్మార్‌ పల్లెకి వెళ్లే దారిలో వెస్ట్‌ చర్చి బ్రిడ్జ్‌ నీటి మునిగింది.

దాన్ని గమనించని పెళ్లి బృందం సుమో.. అదే దారిలో వెళ్లింది. ఈ క్రమంలో సుమో నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో నవ వధువు సంధ్య మృతి ఊపిరాడక మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాహనంలో ఉన్న మిగతా వారిని రక్షించారు. చికిత్స నిమిత్తం వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు.