శవమైన వివాహిత

శవమైన వివాహిత

తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్‌ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో ఉరికి వేలా­డుతోంది. వీరికి యేడాది క్రితమే పెళ్లయింది.

కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని తెలిసింది. వారే హత్య చేశారని మృతురాలి అక్క శ్వేత ఆరోపిస్తోంది. ఘటన తరువాత భర్త, కుటుంబీకులు పరారయ్యారు. సిఐ శివరాజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.