శైలజ రెడ్డి కూతురు ఎవరో తేలిపోయింది

Maruthi next film Naga Chaitanya Samantha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుసగా విజయాలు దక్కించుకుంటూ వస్తున్న మారుతి తాజాగా ‘మహానుభావుడు’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తర్వాత సినిమాపై ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిని కనబర్చుతున్నారు. మారుతి తన తర్వాత సినిమాను నాగచైతన్యతో చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమాకు ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రం ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనే విషయంపై గత కొన్నాళ్లుగా సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, సమంతలు కలిసి నటించబోతున్నట్లుగా దాదాపు రెండున్నర మూడు నెలల క్రితం సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదు అంటూ అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు చెప్పుకొచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుండి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. తాజాగా మరోసారి అవే వార్తలు సినీ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. సమంతకు ఇటీవలే మారుతి కథ పూర్తిగా వినిపించాడు అంటూ సమాచారం అందుతుంది. నాగచైతన్య మరియు సమంతలు కలిసి నటిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుంది. 

సమంత ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా మంచి క్రేజ్‌ వస్తుంది. అందుకే వల్ల ఇప్పటి వరకు రాని సక్సెస్‌ నాగచైతన్యకు ఈ సినిమాతో అయినా వస్తుందనే ఉద్దేశ్యంతో సమంత ఈ సినిమాను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంతలు కలిసి నటిస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. ఇద్దరి కలయికలో ఇంత త్వరగా సినిమా వస్తున్నందుకు ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు.