రంగస్థలం టీజర్‌ గురించి..!

ram charan rangasthalam 1985 movie teaser clarification

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం టీజర్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా లేదా దీపావళికి టీజర్‌ వస్తుందని భావించినా కూడా అప్పుడు నిరాశే మిగిలింది. తాజాగా టీజర్‌కు సంబంధించిన ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ నెల చివర్లో లేదా అంతకంటే ముందే సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ram-charan

భారీ స్థాయిలో అంచనాలున్న రంగస్థలం చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా కూడా పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో రంగస్థలం చిత్రాన్ని వాయిదా వేయడం జరిగింది. పల్లెటూరు నేపథ్యంలో పూర్తి విభిన్నంగా సుకుమార్‌ మార్క్‌ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన పల్లెటూరు సెట్టింగ్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. టీజర్‌లో చరణ్‌ లుక్‌ మరియు పాత్ర తీరుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. విభిన్న చిత్రా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌ ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభను చూపిస్తాడని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.