“అంత్యక్రియలకు అమృతను హాజరుకానిచ్చేది లేదు”

"అంత్యక్రియలకు అమృతను హాజరుకానిచ్చేది లేదు"

నేడు మిర్యాలగూడ హిందూ శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి మృతదేహాన్ని కడసారి చూసుకోవాలని అమృత భావిస్తోంది. తనకు పోలీస్ భద్రత కల్పిస్తే తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులను భద్రత కోరింది.

కూతురు అమృతను తన భర్త మారుతీరావు అంత్యక్రియలకు హాజరుకానిచ్చేదని ఆమె తల్లి గిరిజ స్పష్టం చేశారు. భర్తను కోల్పోయిన దుఖంలో ఉన్న గిరిజ.. కూతురిపై తన ఆవేదనను వెల్లగక్కారు. ఈ విషయంపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ కూడా స్పందించారు. తన అన్న అంత్యక్రియలకు అమృతకు హాజరుకానిచ్చేది లేదని, చివరిచూపు చూడటానికి తమకు ఇష్టం లేదన్నారు. మరోవైపు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.