మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలె రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది. ఈ మూవీలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో ఇప్పటికే మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.