బాలయ్య, రామ్ పోతినేనిలతో మాస్ మల్టీస్టారర్ రాబోతోంది?

Mass multistarrer coming with Balayya and Ram Pothineni?
Mass multistarrer coming with Balayya and Ram Pothineni?

మన టాలీవుడ్ మాస్ హీరోస్ లో నందమూరి నటసింహ బాలకృష్ణ సీనియర్ హీరోస్ లో ఒకరు కాగా ప్రెజెంట్ యంగ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కూడా మంచి ఫేమ్ మాస్ ఆడియెన్స్ లో ఉన్నది . అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీ ల పర్వం ఊపందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇలా ఈ ఇద్దరి కలయికలో అయితే సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ పడబోతునట్టుగా ఇప్పుడు క్రేజీ బజ్ వినిపిస్తుంది.

మరి ఈ మూవీ ని మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించనున్నట్టుగా టాక్. అంతేకాకుండా ఈ మూవీ కి ఇద్దరు దర్శకులు పని చేస్తారంటూ బజ్ వినిపిస్తోంది. ఇక ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే . ఒకవేళ నిజం అయితే మాస్ ఆడియెన్స్ కు వీరి కాంబినేషన్ క్రేజీ ట్రీట్ ని డెఫినెట్ గా అందిస్తుంది అని చెప్పుకోవాలి . ప్రస్తుతం బాలయ్య దర్శకుడు కొల్లి బాబీతో తన 109వ మూవీ లో బిజీగా ఉండగా రామ్, దర్శకుడు పూరీ జగన్నాధ్ తో చేసిన మాస్ సీక్వెల్ మూవీ “డబుల్ ఇస్మార్ట్” రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు.