వైసీపీ హయాంలో లిక్కర్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి.. గత హయాంలో సొంతంగా డిస్టిలరీలు పెట్టడం బాధాకరమని చెప్పారు. కల్తీ మద్యంతో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగిపోయాయని అన్నారు. లిక్కర్ స్కాం అనేది క్షమించరాని నేరమని చెప్పారు. ఏపీలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా కాలేజీలు, సీట్లు పెరుగుతాయని చెప్పారు. విద్యార్ధుల సమస్యలను ఎన్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
