వరంగల్ లో ఘోర అగ్నిప్రమాదం…శరీరాలు తెగి ఎగిరి పడ్డాయి !

massive fire accident in warangal bhadrakali fireworks

వరంగల్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోటిలింగాల దగ్గర భద్రకాళి ఫైర్ వర్స్క్ గోదాంలో మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టలేని విధంగా మారాయి. పేలుళ్ల ధాటికి శరీర భాగాలు తెగిపోయాయి. కొన్ని శరీర భాగాలు అయితే ఫ్యాక్టరీకి 200 మీటర్ల దూరంలో పడ్డాయి అంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఘటనా ప్రాంతంలో భారీగా మంటలు, పొగలు అలుముకున్నాయి.

బాణాసంచా కావడంతో అందులోని కెమికల్స్ వల్ల భరించలేని వాసన వస్తోంది. పెద్ద ఎత్తున ఫైర్ వర్క్ వాహనాలు, టూవీలర్లు కాలిపోయాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. పెట్రోల్ ట్యాంకులు పెద్ద పెద్ద శబ్ధంతో పేలినట్లు స్పాట్ చూస్తే తెలుస్తోంది. పేలుడు జరిగిన సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మిగిలిన వారు తమ ప్రాణాలను కాపాడుకోలేక పోయారు. కార్మికుల మృతితో వరంగల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.విశ్వనాథర్‌ రవీందర్‌, డీసీపీ, ఏసీపీ తదితరులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కోఆర్డినేట్ చేస్తున్నారు.