తన కెరీర్లో లోటుగా ఉన్న టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారీ నాదల్కు నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్కసారీ చాంపియన్‌గా నిలువలేకపోయిన 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నాదల్ సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు.
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 7–6 (7/4), 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్)పై గెలిచి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు.
నాదల్‌తో గతంలో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన మెద్వెదేవ్ మొదటిసారి స్పెయిన్ స్టార్‌ను ఓడించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ (ఆస్ట్రియా)తో మెద్వెదేవ్ టైటిల్ కోసం తలపడతాడు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి వారి ఖాతాలో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ చేరుతుంది.