మెగా ఫ్యామిలిలో భిన్నమైన రాజకీయ భావాలు ఉంటాయని అందరికి తెలిసిందే. అయితే సినిమాల నుండి నేరుగా రాజకీయయాల్లోకి వెళ్ళి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. అయితే తాను అంతలా నమ్ముకున్న పార్టీని కాంగ్రెస్ లో కలపడం జీర్ణించుకోలేని పవన్ కళ్యాణ్ ఆ తరువాత చిరంజీవికి, మెగా ఫ్యామిలీ కి పూర్తిగా దూరమయ్యారు. ఆ తరువాత తాను కూడా జనసేన అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే జనసేన పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా చిరంజీవి నుండి ఎలాంటి మద్దతు లభించలేదని చెప్పాలి.
కాగా ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కూడా. కానీ చిరంజీవి మాత్రం సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలకు చిరంజీవి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. అయితే తన సోదరులు ఇద్దరు కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా చిరంజీవి ఇలా వైసీపీ ప్రభుత్వం పై ఇలా ప్రశంసల వర్షం కురిపించడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ కి మరియు చిరంజీవికి మధ్యలో మళ్ళీ విభేదాలు వచ్చాయని అందుకే చిరంజీవి ఇలా సీఎం జగన్ కి మద్దతిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మళ్ళీ విడిపోతుందా అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియాల్సి ఉంది.