హీరో గోపీచంద్ కి వ్యతిరేకంగా మెగా అభిమానులు

హీరో గోపీచంద్ కి వ్యతిరేకంగా మెగా అభిమానులు

గోపీచంద్ రీసెంట్ సినిమా చాణక్యపై  చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ సినిమా మొత్తం యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ట్రైలర్  కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాని సైరా రిలీజ్ అయిన రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ చెయ్యడం అనేది మాత్రం కాస్త డేరింగ్ అండ్ రిస్కీ డెసిషన్ అని చెప్పుకోవాలి. సైరా పై భారీ బజ్ ఉన్నా కూడా చాణక్య టీమ్ వెనక్కి తగ్గలేదు. ముందు ముందు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఆ సినిమా రిలీజ్ అనేది అనివార్యం అని తేలింది. దీంతో వాళ్ళు అలానే ముందుకు వెళుతున్నారు.

అయితే ఇప్పుడు రిలీజ్ అయిన సైరాకి ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. సినిమా చూసినవాళ్లు అంతా కూడా హిట్ అంటున్నారు.  దీనికి తోడు చాణక్య సినిమాకి థియేటర్స్ ఇవ్వొద్దు అని మెగాక్యాంప్‌కి సంబందించినవాళ్లు ఎవరో ఫోన్ చేసి చెబుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాణక్య రిలీజ్ సవ్యంగా సాగుతుందా అనేది అనుమానమే. సినిమా బావున్నా కూడా అరకొర థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. అందుకే ఇప్పుడు చాణక్య టీమ్ ఎలాగయినా మంచి థియేటర్స్ సంపాదించే పనిలో బిజీగా ఉంది అని టాక్.

నిజానికి సైరాతో క్లాష్ అనేది చాణక్య టీమ్ కావాలని ప్లాన్ చేసింది కాదు. మెగాస్టార్ సినిమాకి ఎదురుగావెళ్లి నష్టపోవాలని అనుకోరుగా. చాణక్య సినిమా అసలు సమ్మర్‌లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ అప్పట్లో యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు గోపీచంద్‌కి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో అతను చాలాకాలం బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. అసలే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ. దానికి తోడు ఇలా లేట్ అవడం వల్ల వడ్డీ రేట్లు కూడా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ఇప్పుడు దసరా హాలిడే సీజన్‌లో రిలీజ్ చెయ్యడం తప్ప వేరే దారిలేదు. పైగా సైరా ఎప్పుడూ రిలీజ్ చెయ్యాలి అనే డైలమాలో ఉన్నప్పుడే చాణక్య రిలీజ్ డేట్ ఇచ్చేసారు. అందుకే వాళ్ళు ఆ డేట్ కే ఫిక్స్ అయ్యారు.ఇవి రెండు కూడా రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కాబట్టి ఏ ప్రాబ్లెమ్ ఉండదు అనేది ఈ సినిమా టీమ్ ఆలోచన. పైగా ఈ సినిమా పై వీళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.