మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోలోగా రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూర్చారు. డేరింగ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. సాయిధరమ్ తేజ్ సరసన సభా నటేష్ కథనాయిక.
జీ స్టూడియోస్ ప్రకటన మేరకు లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలయ్యే మొదటి సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ కొత్త రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నట్టు ఎవరు ప్రకటించలేదు.. ఇక మెగా మేనల్లుడే సోలోగా సందడి చేయనున్నాడు.
ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమాని సాయిధరమ్ తేజ్ పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. అక్టోబరు రెండో వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తేజ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు అనుకుంటున్నారు.