మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇప్పటికే ఆ ఫ్యామిలీనుంచి చాలా మంది హీరోలయ్యారు. వారసత్వంగా చాలా మంది హీరోలయినా కానీ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది సక్సెస్ఫుల్ హీరోలు మరే ఫ్యామిలీలోను లేరు. ఫామ్‌లో లేని వారు కూడా ఇప్పుడు తిరిగి తమ సత్తా చాటుకున్నారు. అల్లు అర్జున్‌కి చాలా కాలంగా రాని భారీ విజయం వడ్డీతో సహా ‘అల వైకుంఠపురములో’ దక్కింది.
‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ అయినా కానీ ‘రంగస్థలం’ చిత్రంతో చరణ్‌కి దక్కిన విజయ, వచ్చిన పేరు అంత త్వరగా మరుగున పడవు. పదేళ్ల విరామం తర్వాత వచ్చిన చిరంజీవి ఇప్పటికీ వంద కోట్ల షేర్ని అవలీలగా సాధించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తిరిగి రావడంతో ఫాన్స్‌లో మరింత ఉత్సాహంగా వున్నారు. మొదట్లో తడబడిన వరుణ్ తేజ్ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.
వరుసగా ఆరు ఫ్లాపులతో మార్కెట్ మొత్తం కోల్పోయిన సాయి ధరమ్ తేజ్ మళ్లీ ‘ప్రతిరోజూ పండగే’తో తిరిగి తన స్థానాన్ని చేరుకున్నాడు. మెగా హీరోలంతా మంచి ఫామ్‌లో వుండడంతో ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ కాలేదనే లోటు కూడా ఫాన్స్ ఫీలవడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ ఎలాగో ఆ ఫీట్ సాధిస్తాడనే నమ్మకంతో వున్నారు.