ఓటిటిలో కు వచ్చేసిన మెగాస్టార్ “భ్రమ యుగం”

Megastar "Bhrama Yugam" in OTT
Megastar "Bhrama Yugam" in OTT

మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన రెండు మూవీ లు ఈ ఏడాది సౌత్ ఆడియెన్స్ ను’ అలరించడానికి వచ్చేసాయి. మరి వీటిలో తాను మోలీవుడ్ లో నటించిన ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ మూవీ “భ్రమ యుగం” కూడా ఒకటి. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ మూవీ మళయాళ మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు ఆడియెన్స్ ను కూడా ఇంప్రెస్ చేసింది. అలాగే మమ్ముట్టి కెరీర్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా మారిన ఈ మూవీ ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కు వచ్చేసింది.

Megastar "Bhrama Yugam" in OTT

Megastar “Bhrama Yugam” in OTT

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ మూవీ ఈరోజు నుంచి మళయాళం సహా తెలుగు, తమిళ్ మరియు కన్నడ హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ని అప్పుడు థియేటర్స్ లో మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఇప్పుడు సోనీ లివ్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి క్రిస్టో జావియర్ సంగీతం అందించగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.