మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేసారో తెలుసా ..?.. తన జీవితంలో ఫ్యామిలీ స్టార్ అంటే.. తమ నాన్నే అని చిరంజీవి తెలిపారు. తన కుటుంబానికి హీరో కూడా తన ఫాదరే అని చిరంజీవి చెప్పడం పెద్ద విశేషం. కుటుంబ విలువలు కాపాడుకోవడానికి ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే ఎలాంటి ఢోకా ఉండదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందుకే పండగ సమయంలో కుటుంబమంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని.. ఈ ఏడాది ఉగాది కూడా కుటుంబంతో కలిసి నిర్వహించుకున్నామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి ఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చాలా కష్టాలు, ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. సూపర్‌స్టార్లు అయిపోయారని అనుకుంటున్నారా? అని ఒక మూవీ షూటింగ్‌లో ఒక నిర్మాత చాలా అవమానకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడారు. ఆ సమయంలో ఆ సంఘటన నా గుండె పిండేసినట్లైంది. సూపర్ స్టార్ అవ్వాలని అప్పుడు ఫిక్సయ్యాను. ఆ అవమానాన్ని నా ఎదుగుదల కోసం వాడుకుని ఎదిగాను’ అని అంటూ చిరంజీవి చెప్పారు