వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన మేఘ ఆకాష్

వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన మేఘ ఆకాష్

ఇండియాలో వెబ్ సిరీస్ లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ను సినిమా కంటే అధికంగా ప్రేక్షకులు చూశారు. అందుకే ఆ వెబ్ సిరీస్ కు సీక్వెల్ రాబోతుంది. అందులో కీలక పాత్రను సమంత చేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్స్ నుండి టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. కాజల్.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

కొందరు హీరోయిన్స్ తాము వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రకటిస్తూ ఆఫర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన హీరోయిన్స్ లో నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా చేరింది. తమిళంలో ప్రముఖ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్ సిరీస్ లో కీలక పాత్రను మేఘ ఆకాష్ పోషించబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. హీరోయిన్ గా తెలుగు మరియు తమిళంలో ఈమె చేసిన సినిమాలు నిరాశ పర్చాయి. ఈ సమయంలో వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఓకే చెప్పి తన ప్రతిభ కనబర్చేందుకు సిద్దం అయ్యింది.