హైదరాబాద్‌ లో మేఘా షూటింగ్‌

హైదరాబాద్‌ లో మేఘా షూటింగ్‌

’లై’  సినిమా ద్వారా మేఘాకి బాగానే పేరొచ్చింది. ఆ తర్వాత ’చల్‌ మోహనరంగ’ సినిమాలో నటించారామె. రజనీకాంత్‌ ’పేటా’లో కూడా మంచి పాత్ర చేశారీ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’లో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు.

సత్యదేవ్, తమన్నా జంటగా రొమాంటిక్‌ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగశేఖర్, భావనా రవి నిర్మిస్తున్నారు. నాగశేఖర్‌ దర్శకుడు. నేటినుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుపుకోనుంది. హీరో సత్యదేవ్‌ పాత్రతో మేఘా పాత్ర ట్రావెల్‌ అవుతుందట.