అరవింద సమేత మేఘ శ్రీ…!

Megha Sree Secretive Character In Aravinda Sametha

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో ఈషా రెబ్బ సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఈషా ఉన్న విషయం ముందే రివీల్‌ చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు మరో హీరోయిన్‌ మేఘ శ్రీ విషయంలో మాత్రం సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కన్నడ ముద్దుగుమ్మ మేఘ శ్రీ తెలుగులో రెండు మూడు సినిమాలు నటించి మెప్పించింది. తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా హిట్‌ అవ్వక పోవడంతో ఛాన్స్‌ లు రావడం లేదు.

mega-sree

అనుకోని అవకాశం అన్నట్లుగా ఈ కన్నడ బ్యూటీకి అరవింద సమేత చిత్రంలో ఛాన్స్‌ వచ్చింది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ 100 కోట్లను వసూళ్లు చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నారు. ఈ చిత్రంలో మూడవ హీరోయిన్‌ ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది, రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది.

mega-sree-movies