‘మహర్షి’ రీ షూట్‌.. ఫ్యాన్స్‌ టెన్షన్‌…!

Reshoot In Maharshi Movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం భారీ అంచనాల నడుమ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరిలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆ సీన్స్‌లో కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాటిని రీ షూట్‌ చేయాలనే నిర్ణయానికి వంశీ పైడిపల్లి వచ్చాడు అంటూ సమాచారం అందుతుంది.

maharshi

రీ షూట్‌కు మహేష్‌బాబుతో పాటు ముగ్గురు నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది. మరో వైపు మహర్షి రీ షూట్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అంటూ ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం రీ షూట్‌ అంటూ ప్రచారం జరగడం సినిమాకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

mahesh