నాపేరు సూర్యలో శక్తి ఉందా?

Meher Ramesh Attends For Naa Peru Surya Audio Launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

అల్లు అర్జున్‌ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రాన్ని నాగబాబు మరియు లగడపాటి శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంకు షాడో దర్శకుడు మెహర్‌ రమేష్‌ షాడో డైరెక్టర్‌గా వ్యవహరించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ డిజాస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు మెహర్‌ రమేష్‌ గత కొంత కాలంగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నాడని అంతా భావిస్తున్నారు. అయితే మెహర్‌ రమేష్‌ మాత్రం స్టార్‌ హీరోల సినిమాలకు బ్యాక్‌ గ్రౌండ్‌లో వర్క్‌ చేస్తున్నాడని ప్రచారం జరుగుతూనే ఉంది.

తాజాగా నా పేరు సూర్య చిత్రానికి దర్శకుడు వక్కంతం వంశీ కొత్త వాడు అవ్వడంతో మెహర్‌ రమేష్‌ చాలా కీలకంగా వ్యవహరించాడు అంటూ గుసగుసు వినిపిస్తున్నాయి. అందుకే సినిమా ఆడియో వేడుకలో రమేష్‌కు కీలక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన ‘శక్తి’ చిత్రం ఏ రేంజ్‌లో డిజాస్టర్‌ అయ్యిందో ఇంకా నందమూరి అభిమాను మర్చి పోలేదు. అలాంటిది ఇప్పుడు మెగా మూవీలో మెహర్‌ రమేష్‌ హ్యాండ్‌ ఉందని తెలియడంతో మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెహర్‌ రమేష్‌కు స్టైలిష్‌ దర్శకుడిగా పేరుంది. ఆ కారణంగానే నా పేరు సూర్య చిత్రం కోసం ఆయన్ను వాడేసుకోవాని నిర్ణయించుకున్నట్లుగా తొస్తోంది. మెహర్‌ రమేష్‌ ఈ చిత్రానికి స్టైలింగ్‌ అద్ది ఉంటాడని ప్రచారం జరుగుతుంది.