పోకిరితో మహేష్‌ 25 సంబంధం ఏంటి?

Mahesh babu Doing Mass role in His Mahesh 25 Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన భరత్‌ అనే నేను విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల వసూళ్లు లక్ష్యంగా దూసుకు పోతుంది. ఈ సమయంలోనే మహేష్‌బాబు తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. దిల్‌రాజు, అశ్వినీదత్‌లు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాు పూర్తి చేసుకున్న మహేష్‌ 25 చిత్రాన్ని త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌ 25వ సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ చిత్రం గురించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్‌బాబు ఒక సాదారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఒక మద్య తరగతి కుటుంబంలోని వ్యక్తిగా మహేష్‌బాబు కనిపించి చాలా సంవత్సరాలు అయ్యింది. అందుకే ఈ సినిమా చాలా ప్రత్యేకం అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు గతంలో పోకిరి చిత్రంలో కనిపించిన విధంగా అంటే పండు పాత్రలో ఎలా అయితే కనిపించాడో అలాగే తన 25వ చిత్రంలో కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పోకిరి సినిమా మహేష్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తరహాలో మహేష్‌ 25వ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.