సోషల్ మీడియాలో జగన్ పై మీమ్స్

సోషల్ మీడియాలో జగన్ పై మీమ్స్

ప్రతి శుక్రవారం ఠంచన్‌గా సీబీఐ కోర్టులో హాజరు వేయించుకోవాల్సిన వైసీపీ అధినేత జగన్ గత ఎనిమిది నెలలుగా డుమ్మాకొడుతున్నారు. దీంతో కోర్టు చూసీ.. చూసీ ఇక చూడకూడదని నిర్ణయించుకుని.. వచ్చే శుక్రవారం.. అంటే.. పదో తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో కనిపించాలని ఆదేశించింది. ఇప్పుడు.. జగన్ మాత్రమే కాదు.. ఆయన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల కూడా.. కోర్టుకు హాజరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. వీరిద్దరూ సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సిన పని లేదు. వీరు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా లేరు. కానీ.. వీరిపై తెలంగాణ ఓ ఎన్నికల కేసు నమోదయింది.

ఈ కేసులో… వ్యక్తిగతంగా హాజరు కావాలని.. విజయమ్మ, షర్మిలలకు.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ జైల్లో ఉన్న సమయంలో… ఆయన తరపున బయట రాజకీయం చేశారు విజయలక్ష్మి, షర్మిల. అప్పట్లో జగన్ శిబిరంలో కీలకంగా ఉన్న కొండా సురేఖ, కొండా మురళి దంపతులు.. కాంగ్రెస్‌ తీరుపై విసుగెత్తి.. కేబినెట్ నుంచి బయటకు వచ్చి.. పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. పరకాల అసెంబ్లీ ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నిక ప్రచారానికి.. విజయలక్ష్మి, షర్మిల వెళ్లారు. 2012 జూన్‌ 8న పరకాలలో సభ నిర్వహించారు. కానీ సభకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

రోడ్డుపైనే సభ నిర్వహించారు. దీంతో.. కేసు నమోదియంది. ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు.. నిందితులుగా ఉన్న కొండా మురళి, కొండా సురేఖలతో పాటు విజయలక్ష్మి, షర్మిలలకు కూడా సమన్లు జారీ చేసింది. 10న హాజరుకావాలని స్పష్టం చేసింది. ఓ వైపు జగన్.. ముఖ్యమంత్రి హోదాలో…కోర్టుకు హాజరవుతారా లేదా..అన్న చర్చ జరుగుతూండగా.. ఇతర కేసుల్లో.. ఆయన కుటుంబసభ్యులు కూడా అదే రోజు కోర్టు మెట్లెక్కుతూండటం… ఆసక్తికరంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలోనూ మీమ్స్ తయారయ్యాయి. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితాలో… పదో తేదీన జగన్ కుటుంబం కోర్టుకు హాజరయ్యే విషయాలను చేర్చి.. వైరల్ చేస్తున్నారు.