మెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫైఓవర్ కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ.. మెట్రో రైల్ వెళుతుండగా బ్రిడ్జ్ కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 10.30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని అధికారులును ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించి సీసీ టీవీ దృశ్యాలు వైరల్గా మారాయి.