నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్,ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జీడీసీ-గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ప్రారంభించారు.అమెరికాకు చెందిన ఈసెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ఇటీవలే బెంగళూరు ప్రారంభించి శుక్రవారం హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభించింది.
కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని..సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుచేయడం రాష్ట్రానికి గర్వకారణమని, ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
సంస్థ సీఈవో సంజయ్‌మెహ్‌రోత్రా విలేకరులతో మాట్లాడుతూ 35వేల చ.అ.విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేశామని బెంగళూరుతోపాటు హైదరాబాద్ జీడీసీలో సుమారు700దాకా ఉద్యోగుల సంఖ్య ఉండబోతుందని, భారత్‌లో మొత్తం 2,000 దాకా సిబ్బంది పెంచె అవకాశం చెప్పారు.