సొంతూరబాట పట్టిన వలస కూలీలు.. 8మంది మృతి

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు ఇంకా ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి. దేశంలో ముఖ్యంగా లాక్‌డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. వలస కార్మికులు సొంతూళ్లకు తరలి వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే వారి వెతలు మాత్రం ఏమాత్రం తీరడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లు సరిపోకపోవడంతో వలస కార్మికులు సొంతూరుకు చేరేందుకు ఇప్పటికీ తమకు అందుబాటులో ఉన్న వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సామర్థ్యానికి మించిన వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

అయితే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును గుణ దగ్గర ఓ బస్సు వేగంగా వస్తూ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అలాగే.. 50 మందికిపైగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి వారంతా యూపీలోని సొంతూళ్లకు వెళ్తుండగా… ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా ముజఫర్‌నగర్‌ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు. నడుచుకుంటూ కాలినడకన వెళ్తున్న కార్మికులపై బస్సు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు.