పీవీపీని కెలుకుతున్న ఎంఐఎం

MIM Party Giving Troubles To PVP In House Construction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

MIM Party Giving Troubles To PVP In House  Construction

పీవీపీకి తెలుగు రాష్ట్రాల్లో కష్టాలు తప్పడం లేదు. ఏపీలో గతంలో ఎంపీ సీటు కోసం ఎన్ని ఫీట్లు చేసినా పాట్లే మిగిలాయి. పవన్ ను పట్టుకున్నా.. కేశినేని నాని ముందు ఆటలు సాగలేదు. చివరకు ఏపీ వదిలేసి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుందామంటే.. ఇక్కడా ఎంఐఎం అడ్డు పడుతోంది. అసలింతకీ పీవీపీకి ఏమైంది జాతకం బాగోలేదా.. లేకపోతే స్వయంకృతాపరాధాలా అని సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది.

మల్టీ లెవల్ వ్యాపారాలు చేస్తూ.. వీవీఐపీగా చలామణీ అవుతున్న పొట్లూరి వర ప్రసాద్ కు స్థలం చిక్కొచ్చి పడింది. బంజారాహిల్స్ లో ఆయన స్థలానికి ప్రభుత్వ దారి ఉంది. అయితే ఎవరో ప్రైవేట్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తూ గోడ కట్టేశాడు. జీహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే.. అడ్డుకుని హంగామా చేశారు. చివరకు ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే జోక్యంతో పరిస్థితి శృతిమించింది.

ఏకంగా జీహెచ్ఎంసీ అధికారుల్నే తిట్టేసిన ఎమ్మెల్యే.. వారిని బెదిరించి వెనక్కి పంపించారు. ఎంఐఎం నేతల హడావిడికి అధికారులు కూడా వెనక్కితగ్గారు. మరి నా స్థలానికి దారి ఎలాగని పీవీపీ మథనపడుతున్నారు. అవసరమైతే సీఎంను కలవాలనుకుంటున్నారు. కానీ ఎంఐఎంను కాదని ఎవరూ ఏం చేయలేరని పీవీపీకి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.

మరిన్ని వార్తలు: