Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్ పుత్ ల గౌరవాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పద్మావత్ కు వ్యతిరేకంగా రాజ్ పుత్ కర్ణిసేన ఓ పక్క ఆందోళనలు నిర్వహిస్తోంది. రాజ్ పుత్ లకన్నా ముస్లిం సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని గొప్పవాడిగా చూపారన్నది కర్ణిసేన ఆరోపణ. రాజ్ పుత్ ల ఆందోళన నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని పద్మావత్ పై నిషేధం విధించడం, సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేయడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. జవనరి 25న సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా…కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడుతోంది. అయితే ఇప్పటిదాకా హిందువులే ఈ సినిమాను వ్యతిరేకిస్తుండగా…ముస్లింల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తంలేదు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పద్మావత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఓ కట్టుకథని…దాన్ని ముస్లింలు ఎవరూ చూడవద్దని సలహా ఇచ్చారు. రాజ్ పుత్ రాణి పద్మావతి, ముస్లిం సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీల కథ అని సినిమా తీశారని, 1540నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథను చరిత్రగా మలిచారని ఆరోపించారు. పద్మావత్ లాంటి అశ్లీల చిత్రం చూడొద్దని….మంచి పనులు చేసి మంచి జీవితం గడిపేందుకే దేవుడు మనల్ని పుట్టించాడని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు