‘నోటా’ బిజినెస్‌ మైండ్‌ బ్లోయింగ్‌…!

Mind Blowing Pre Release Business Stats Of NOTA Movie

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 60 కోట్లకు పైగా షేర్‌ను వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇంకా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. 410 థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులను పూర్తి చేసుకోవడం అతి పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో అమాంతం పెరిగి పోయింది. మొన్నటి వరకు కోటికి అటు ఇటుగా పారితోషికం అందుకున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఏకంగా 10 కోట్లకు అటు ఇటుగా పారితోషికంను డిమాండ్‌ చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించడంతో విజయ్‌ తర్వాత చిత్రం ‘నోటా’పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

nota-vijay-movies

ఇటీవలే విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ‘నోటా’ చిత్రం ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తొగు మరియు తమిళంలో తెరకెక్కిన విషయం తెల్సిందే. జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రం తొగు రాష్ట్రాల థియేట్రికల్‌ హక్కులకు రెక్కలు వచ్చాయి. కేవలం ఆంధ్రా మరియు సీడెడ్‌లో ఈ చిత్రం 30 కోట్ల రేటు పలుకుతుందని సమాచారం అందుతుంది. ఇక నైజాం ఏరియాలో ఈ చిత్రం 20 కోట్ల వరకు బిజినెస్‌ చేస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి 50 కోట్ల వరకు కేవలం తెలుగు రాష్ట్రాల ద్వారా వస్తుందనే నమ్మకంతో చిత్ర నిర్మాతలు ఉన్నారు. ఇక ఓవర్సీస్‌ రైట్స్‌ తమిళ రైట్స్‌ రూపంలో మరో 30 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 80 కోట్లు కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా రాబోతున్నాయి. ఇక మరో 25 నుండి 30 కోట్ల వరకు శాటిలైట్‌, ప్రైమ్‌ వీడియో, ఆడియో, ఆన్‌లైన్‌ రైట్స్‌ ద్వారా దక్కే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి ‘నోటా’ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉందని సినీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

nota-movie-vijay-devara-kon