పిలుపులు పెళ్ళికి కాదు భోజనానికా?

Minister Etela Rajendar son wedding food timings

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ముహూర్తం టైం కి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళమని అతిథుల్ని పిలుస్తారు.పెళ్లి కార్డు లో కూడా వధూవరుల,ముహూర్తం,వేదిక వంటి వాటికి పెద్ద పీట వేసి ఎక్కడో చోట విందు సమయం గురించి ముద్రిస్తారు.కానీ సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి కొడుకు పెళ్లి విషయంలో ఓయూ విద్యార్ధులకి భిన్నమైన అనుభవం ఎదురైంది.మంత్రి ఈటెల రాజేందర్ కుమారుడి పెళ్ళికి ప్రత్యేకంగా ఓయూ స్టూడెంట్స్ కి ఆహ్వానాలు రాలేదు. కానీ ఈ హాస్టల్ దగ్గర ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దాదాపు 2000 వేలమందికి నాన్ వెజ్ వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేశారు.వాట్స్ అప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వారికి విందు కి రావాలని ఆహ్వానాలు వెళ్లాయి.అయినా పెళ్ళికి పిలవకుండా భోజనానికి పిలవడమేంటని విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు.అందుకే అంత గ్రాండ్ గా ఏర్పాటు చేసిన విందుకి హాజరు అంతంత మాత్రం గానే వుంది.

ఈ విందు ఏర్పాటు వెనుక కొందరు రాజకీయ కోణాన్ని కూడా చూస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థులు తిరుగులేని అస్త్రంగా తెరాస కి ఉపయోగపడ్డారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక ఆ సంబంధాల్లో మార్పు వచ్చింది.తెరాస నేతలు ధైర్యంగా క్యాంపస్ కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.ఉద్యోగాల కల్పన సహా వివిధ అంశాల్లో తెరాస సర్కార్ తో విద్యార్థులు విభేదిస్తున్నారు.తమను ఉద్యమ సమయంలో వాడుకుని అధికారం దక్కగానే వదిలేశారని స్టూడెంట్స్ బాధపడుతున్నారు.అందుకే ఓయూ శతాబ్ది ఉత్సవాల టైం లోను సభకు వెళ్లిన సీఎం కెసిఆర్ ఒక్క మాట మాట్లాడకుండానే వెనక్కి వచ్చారు. ఈ పరిస్థితిని మార్చడానికే తెరాస ఇలాంటి విందు రాజకీయాలు చేస్తోందని కొందరు అంటున్నారు.ఇందులో నిజమున్నా లేకున్నా పిలుపులు పెళ్ళికి కాకుండా విందుకి వెళ్లడమే చిత్రమే అనిపిస్తోంది.