విజయసాయి జ్యోతిష్కుడా?

Vijayasai Reddy wonderful Political Astrologer

 Vijayasai Reddy wonderful Political Astrologer

వైసీపీ అధినేత జగన్ నేడు ఎదుర్కొంటున్న ఆర్ధిక అవకతవకల కేసుల గురించి బయటపడేదాకా ఈ వ్యవహారాల వెనుక వున్న విజయసాయి పేరు కూడా చాలా మందికి తెలియదు. ఆ కేసుల్లో జగన్ తో పాటు విజయసాయి జైలుకి వెళ్ళాక ఆయన కి ప్రచారం పెరిగింది.జైలు నుంచి బయటికి వచ్చాక వైసీపీ వ్యవహారాల్లోనూ విజయసాయి బిజీ అయ్యారు.జగన్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు.ఇదంతా చూసిన చాలా మంది విజయసాయికి రాజకీయం ఏమి తెలుసు ..ఆయన ఓ ఆడిటర్ మాత్రమే కదా అనుకున్నారు.కానీ వారి అంచనాల్ని తల్లకిందులు చేసేలా విజయసాయి ప్లాన్స్ వేస్తున్నారు.ఆయన ముందు చూపుకి అద్దం పట్టే కొన్ని విషయాలు చూస్తే ఈయనకి జ్యోతిష్యం తెలుసా అనిపిస్తుంది.

కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఓ ఏడాది కిందట వైసీపీ అధినేత జగన్ కొన్ని పరిహార పూజలకోసమని రిషికేష్ వెళ్లారు.ఆయన పని ఆయన చూస్తుంటే అటు విజయసాయి ఓ హోటల్ లో బీజేపీ నేత యెడ్యూరప్ప తో భేటీ అయ్యారు.అప్పటికి యెడ్డీకి బీజేపీ లో పెద్దగా విలువ లేదు.కానీ ఆ భేటీ జరిగిన కొన్నాళ్ళకు బీజేపీ యడ్యూరప్పని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.ఆయనతో అప్పుడు జరిగిన చర్చల ఫలితమే ఈ మధ్య జగన్ తో మోడీ భేటీ అని వైసీపీ ముఖ్యులు చెబుతున్న మాట. ఇక తాజాగా ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ..రామనాధ్ కోవిద్ అనే పేరు రాజకీయ సర్కిల్స్ కి కొంత తెలుసు కానీ ఆయన రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఎవరూ ఊహించలేదు.చివరకు బీజేపీ మిత్రులకి సైతం ఈ విషయం తెలియదు.కానీ విజయసాయి ఈ అంశాన్ని ఊహించారు.కిందటి నెలలో ఆయన బీహార్ వెళ్లారు.మే 26 న రాజ్ భవన్ కి వెళ్లి కోవిద్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు దర్శనమిస్తున్నాయి.నిజానికి కోవిద్ తో విజయసాయికి అంత పెద్ద పరిచయం లేదు.కానీ ముందుగానే ఆయన్ని ప్రత్యేకంగా కలవడం చూస్తుంటే విజయసాయికి జ్యోతిష్యం తెలుసంటారా..లేదా?