విజయసాయిరెడ్డి సభ్యత్వం రద్దు చేయండి !

Cancel the membership of vijayasaireddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ లోక్ సభ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. విజయసాయిరెడ్డిని వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందనీ, ఇది  ఆర్టికల్ 102 కింద రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ ఆర్టికల్ కింద లాభదాయక పదవిని చేపడితే రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడు అవుతారని చెప్పారు. కొన్నిరోజుల క్రితం విజయసాయిరెడ్డిని  ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. అనంతరం కొద్దిరోజులకే దానిని రద్దు చేసి, ప్రత్యేక ప్రతినిధి పదవి లాభదాయక హోదా కిందకు రాదని ఆర్డినెన్స్ జారీచేసింది. అనంతరం తిరిగి విజయసాయిని ఆ పదవిలో నియమించారు. టీడీపీ నేతలు దీనిని ప్రస్తావిస్తూనే రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాశారు.