టీడీపీతో పొత్తు… పవన్ కు ప్లస్ …

Alliance with TDP... plus for Pawan...
Alliance with TDP... plus for Pawan...

రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి టి‌డి‌పి-జనసేన కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టడానికి టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మరి టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్ ఉంటుందా? అంటే కాస్త రిస్క్ ఉండొచ్చనే విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయిన మాట వాస్తవం.

జనసేనకు దాదాపు 40 పైనే స్థానాల్లో 10-40 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే ఆయా స్థానాల్లో టి‌డి‌పిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఒకవేళ అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ కనీసం ఇంకో 40 స్థానాలు కోల్పోయేది. ఒకవేళ గెలిచేది కానీ 151 సీట్లు వచ్చేవి కాదు. అయితే ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. పైగా జనసేన- టి‌డి‌పిలు బలపడ్డాయని, అందుకే రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్ పెట్టవచ్చు అని ప్రచారం వస్తుంది.

కానీ ఇక్కడ వైసీపీ వర్గాల విశ్లేషణ వేరుగా ఉంది. రెండు పార్టీలు కలిస్తే తమకే లాభమని చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తులో జనసేన శ్రేణులు..టి‌డి‌పికి ఓట్లు వేయడం అనేది కాస్త కఠినమైన విషయమే అంటున్నారు. ఎందుకంటే పవన్ సి‌ఎం అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ సి‌ఎం అని వాళ్ళు భావిస్తున్నారు. పొత్తు వలన చంద్రబాబు తప్పుకుంటే పవన్‌కు ఆ ఛాన్స్ ఉండదు. ఈ నేపథ్యంలో పవన్ సి‌ఎం కానప్పుడు, టి‌డి‌పికి ఎందుకు ఓట్లు వేయాలనే అంశం కూడా వస్తుంది.