ఎన్టీఆర్ మౌనంపై స్పందించిన అచ్చెన్నాయుడు…!

Achchennaidu reacted to NTR's silence...!
Achchennaidu reacted to NTR's silence...!

జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై స్పందించిన అచ్చెన్నాయుడు….ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలని.. ఎవరినీ స్పందించమని మేం అడగబోమని అచ్చెన్నాయుడు చెప్పారు . apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను టీడీపీ సీనియర్ నేతలు ప్రారంభించారు .

ఈ కార్యక్రమానికి యనమల, నిమ్మల రామానాయుడు,అచ్చెన్నాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…చంద్రబాబును సంబంధం లేని కేసులో ఇరికించారని.. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశా మని.. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైటులో పొందుపరిచామని వెల్లడించారు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందన్నారు. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు .