రైతులకు తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందో వచ్చి చూడండంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రైతులను అవమానిస్తే సహించేది లేదన్నారు.
పీయూష్ గోయల్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘మా రైతులు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. రైతులను మేము కాదు.. మీరే మోసం చేస్తున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చినందుకు క్షమాపణ చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.