మానవత్వాన్ని చాటుకున్న హరీశ్ రావు

మానవత్వాన్ని చాటుకున్న హరీశ్ రావు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి పడ్డ యువకులను చూసి కారులో నుంచి దిగి పరామర్శించారు. వారిని ఆస్పత్రికి తరలించి మంచి చికిత్స అందించాలని ఆదేశించారు. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తూ బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు. చుట్టుపక్కల ఎవరూ లేరు.

ఇదే సమయంలో దౌల్తాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారు ఆపి దిగారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని వారికి గాయాలను గుర్తించారు. అక్కడే ఉన్న ఎస్సైకి చెప్పి వారిని ఆసుపత్రికి చేర్పించారు. ఇద్దరు యువకులను దగ్గర ఉండి ఆసుపత్రిలో చేర్పించి, దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించేలా చూసుకోవాలని ఆదేశించారు.

ఉదయం మంత్రి హరీశ్ రావు దుబ్బాక ఫలితంతో ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంతక్రియాల్లో పాల్గొని పాడే మోశారు. ‘‘స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది. అండగా ఉంటుంది. ప్రస్తుతానికి రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించాం.

భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్‌లో తల్లి కోరుకున్న విధంగా చదివిపిస్తాం.రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదాం. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి. సహనం కోల్పోవద్దు. మనోధైర్యం కోల్పోవద్దు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుంది.’’ అని భరోసా ఇచ్చారు.