Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమలపాకుతో నువ్వోకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లు కొట్టుకుంటున్నాయి తెలుగుదేశం, భాజపాలు. ఇలాగే టిడిపి, బిజేపి కొట్టుకుని విడాకులు తీసుకుంటే తాము బిజెపితో జట్టు కడదాం అని వేచి చూస్తున్నా వైకాపాకి కౌంటర్ యిచ్చారు బిజేపి నాయకుడు, అంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. నీతి నిజాయితీకి మారు పేరు అయిన మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజేపి అవినీతికి, అరాచకానికి కేరప్ అడ్రస్ గా ఉన్న జగన్ తో ఎందుకు కలుస్తుంది, 13 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ తో మేము ఏరకంగా నీతి, నిజాయితీ గురించి మాట్లాడగలం అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు మంత్రి కామినేని శ్రీనివాస్. రాష్టంలో అవినీతి జగన్ పార్టీతో కలిసి ఎన్నికలలో పోటి చేసే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు కామినేని. .