నాకు పెళ్లయింది.. ఆయనకు

Minister KTR Counter commentas on Rahul Gandhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీఆర్ఎస్ నేతలు వేసే పంచ్ లకు కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. కాంగ్రెస్ అధిష్ఠానంపై నోటికొచ్చినట్లుగా విమర్శలు చేసే గులాబీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. తాను ఎలా బచ్చా అవుతానని కేటీఆర్ ప్రశ్నించారు. పెళ్లయిన తానే బచ్చా అయితే.. పెళ్లే కాని రాహుల్ ఏమౌతారని ఆయన సూటిగా కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించారు.

సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ లేదని తెలిసే గులాబీలు రెచ్చిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సోనియాకు పాదాభివందనం చేసిన కేసీఆరే.. ఇప్పుడు దగ్గరుండి సోనియాను, రాహుల్ ను తిట్టించడం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అసమర్థత కారణంగానే తెలంగాణ ఇచ్చి కూడా సోనియా తిట్లు తినాల్సి వస్తుందని మథనపడుతున్నారు.

కుటుంబ పాలన గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ముందు.. తమ అధిష్ఠానాన్ని గాంధీ కుటుంబానికి కాకుండా వేరే వ్యక్తికి ఇస్తారా అని అడిగారు కేటీఆర్. దేశంలో కుటుంబ పాలన మొదలెట్టిన కాంగ్రెస్ కు ఇతర పార్టీల్ని అనే హక్కు లేదని, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం అన్నింటిలోనూ కాంగ్రెస్సే అందరికీ గురువని కడిగిపారేశారు కేటీఆర్.