కోవింద్ కు ఓటేసిన యూపీఏ ప్రజాప్రతినిధులు

The UPA's peoples voted for Ram Nath Kovind

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పాచిక పారింది. అధిష్ఠానాల్ని ధిక్కరించి చాలా మంది క్రాస్ ఓటింగ్ చేశారు. ప్రతిపక్షాల్లో అనైక్యత కోవింద్ కు కలిసొచ్చింది. అనుకున్న మెజార్టీ కంటే భారీ తేడాతోనే కోవింద్ గెలుస్తారని బీజేపీ ధీమాగా ఉంది. కాగా ఇప్పటిదాకా కాంగ్రెస్ తోనే ఉంటాం. రాష్ట్రపతి ఎన్నికలు సిద్ధాంతాల ప్రాతిపదికగా జరుగుతున్నాయని డబ్బా కొట్టిన శరద్ పవార్ ముందుగానే బీజేపీకి జై కొట్టారు.

చివరి నిమిషంలో పవార్ ఇచ్చిన షాక్ కు సోనియాకు దిమ్మ తిరిగిందట. దీనికి తోడు మోడీ బద్ధవ్యతిరేకి మమత పార్టీ తృణమూల్లో కూడా కొందరు కోవింద్ కు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఎన్డీఏకు ఓట్ల సంఖ్య పెరిగింది. మీరాకుమార్ గెలవడం సంగతి తర్వాత.. ముందు ఉన్న ఓట్లన్నీ కూడా పడలేదని తేలిపోయింది. దీంతో సోనియా పరువు పోయింది.

సమాజ్ వాదీ పార్టీ లో కూడా రెండు గ్రూపులు రెండు రకాలుగా ఓటేశాయి. ములాయం కోవింద్ కు ఓటేస్తే.. అఖిలేష్ వర్గం మాత్రం సోనియాకు జై కొట్టింది. కానీ ఉన్న బలమే తక్కువైనప్పుడు ఇన్ని ముక్కలైతే ఎలాగని సోనియా ఆగ్రహంగా ఉన్నారట. అసలు ప్రతిపక్షాల్ని ఏకం చేయాలని కోరిన నితీష్ ముందే పక్కకు జరగడం, తర్వాత పవార్ ఇచ్చిన షాకుతో ఎవర్ని నమ్మాలో తెలియని స్థితిలో సోనియాలో ఉన్నారు.