Election Updates: రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ ..!

Election Updates: Congress stopped Rythu Bandhu before coming to power: KTR
Election Updates: Congress stopped Rythu Bandhu before coming to power: KTR

తెలంగాణలో గత రెండు, మూడు రోజుల నుంచి మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ మంత్రి కేటీఆర్ ఇలా ట్వీట్ చేశాడు. ఒక తండ్రి తన కొడుకు మీద ప్రేమతో వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును కూడా నీచ రాజకీయాలకు వాడుకోవటం కేవలం రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేట్ క్రిమినల్‌కే చెల్లుతుంది.

అసలు అమరుల పేరు ఎత్తే కనీస అర్హత కూడా రేటెంత రెడ్డికి లేదు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నువ్వు.. ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తిన నువ్వా అమర వీరుల మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నది? కాంగ్రెస్ పార్టీయే వేలాది మంది యువకులను పొట్టనబెట్టుకుంది.. సోనియా గాంధీ బలి దేవత అని నువ్వే కదా అన్నది, మర్చిపోయావా? వ్యక్తిగత విషయాలను, రాజకీయాలను ముడిపెట్టడం బంద్ చేయకుంటే.. నీ లాంటి బ్రోకర్ కమ్ బ్లాక్‌మెయిలర్‌కు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాతపెట్టడం గ్యారెంటీ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.