నారాయణకు నష్టం చేస్తున్న మంత్రి నారాయణ ?

minister narayana comments on junior municipal colleges

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కార్పొరేట్ కాలేజీ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయా అని ఎదురు చూసే వాళ్లకి శుభవార్త. ఏ కార్పొరేట్ కాలేజీలు ఇలా జరక్కుండా అడ్డు పడుతున్నాయని భావిస్తున్నారో అదే బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి మంత్రి అయిన నారాయణ ఈ చిరకాల స్వప్నాన్ని నిజం చేసే పనికి పునాది రాళ్లు వేస్తున్నారు. ఈ ఏడాది కార్పొరేట్ కి ధీటుగా విద్యని అందించే మున్సిపల్ జూనియర్ కాలేజీ ఒక దాన్ని లాంఛనంగా మొదలు పెట్టబోతున్నారు. దీని వల్ల తమ నారాయణ సంస్థలకి నష్టం వచ్చినా పర్లేదని చెప్పిన మంత్రి సిబ్బంది శిక్షణకు కూడా తమ కాలేజీ వనరులని ఉపయోగించడం గ్రేట్ . అయితే ఈ సంస్థల్ని ఇంగ్లీష్ మీడియం పేరు చెప్పి అడ్డుకోవడం తగదని నారాయణ అన్నారు. నెల్లూరు లో ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రసంగంలోని బులెట్ పాయింట్స్ ఇవే …

మున్సిపల్ జూనియర్ కాలేజి సందర్శన సందర్భంగా పురపాలక మంత్రి నారాయణ గారి కామెంట్స్ …….

* ఈ సంవత్సరం రాష్ట్రంలో ఒకచోట మున్సిపల్ జూనియర్ కాలేజి ఏర్పాటు చేయాలనుకున్నాం

* వి.ఆర్.సి ఉచితంగా భవనాలు ఇచ్చింది, నారాయణ విద్యాసంస్థలు మెటీరియల్, వారాంతపు పరీక్షలు, టీచర్ల ట్రైనింగ్ వంటి వాటిలో సహకారం అందిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.

* ఇతర ఆర్ధికపరమైన సహకారం మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తోంది
     దీనికి మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు

* ఈ విద్యార్థులు 2018లో అద్భుత రిజల్ట్స్ సాధించబోతున్నారు

* 2019 కి ఈ పిల్లల ద్వారా ర్యాంకులు కొట్టబోతున్నాం

* దేశానికే ఏపి మున్సిపల్ స్కూళ్ళు, జూనియర్ కాలేజి ఆదర్శంగా నిలిచేలా చేస్తాం

* ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మున్సిపల్ స్కూల్స్ లో, అంగన్ వాడీల్లో 15-20% విద్యార్థుల సంఖ్య పెరిగింది

* ఇంగ్లీషు మీడియం మీద గోల చేసిన వారికి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, బెగ్గింగ్ చేస్తున్నా

* తెలుగు భాషకు ఎలాంటి ఇబ్బంది రాదు, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది

* అంతర్జాతీయ పోటీలో మన పిల్లలు నిలవాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి

* గత సంవత్సరం ఎంసెట్ లో టాప్ 5000 ర్యాంకుల్లో ఇంజనీర్ , మెడిసిన్ లో ఒక్కరే ప్రభుత్వ కాలేజీలో తెలుగు మీడియం విద్యార్థి ఉన్నారు

* ఈ డేటా చూడండి, స్టడీ చేయండి తర్వత మాట్లాడండని వారందరికీ మనవి చేస్తున్నా

* వారి పిల్లలను ఎందుకు తెలుగు మీడియం చేర్చడం లేదని ప్రశ్నిస్తున్నా

* మీ పిల్లలు ఏ మీడియం లో చదుతున్నారో చెప్పి డిబేట్ చేయమని సవాల్ చేస్తున్నా

* అప్పుడు మీకు సరెండర్ అవడానికి కూడా నేను సిద్ధం

* అంగన్ వాడీలో సంచలనమైన మార్పు తెచ్చాం

* రాజకీయ నాయకులకు, టీచర్లకు, యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా

* తెలుగుకు వచ్చిన ఇబ్బంది లేదు, సబ్జెక్ట్ ఉంటుంది
అంతర్జాతీయ కాంపిటేషన్ కి నిలబడాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి

* టీచర్లు కూడా ఇబ్బంది పడకుండా వారికి ఇంగ్లీషు మీడియం టీచింగ్ పై ఓరియంటేషన్ ఇస్తున్నాం

* మొదటి ఆరు నెలలు 75% తెలుగు, 25% ఇంగ్లీషులో చెప్పండి

* తర్వాతి 3 నెలలు 50% తెలుగు, 50% ఇంగ్లీషులో చెప్పండి

* చివరి 3 నెలలు 25% తెలుగు, 75% ఇంగ్లీషు చెప్పమని టీచర్లకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం

* 2022 కి దేశంలో ఎడ్యుకేషన్ కి ఏపి ని కేపిటల్ చేస్తాం, ముఖ్యమంత్రి కలను నిజం చేయడమే లక్ష్యం

* నా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నా, నా విద్యా సంస్థలకు నష్టం వచ్చినా పర్లేదు

* ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను

* నా చిత్తశుద్ధిని శంకించవద్దు

మరిన్ని వార్తలు

అనుకోకుండా ఒకరోజు..

మోడీకి కష్టకాలమేనా..?

కోవింద్‌ ప్రొఫైల్…