బిగ్‌బాస్‌ : నాకంత టైం లేదన్న హాట్‌బ్యూటీ

Anasuya Not Interested Participating In NTR Big Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అనసూయ హౌస్‌లోకి ఎంటర్‌ కాబోతుందని, కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు ఆమె బిగ్‌బాస్‌ షోలో ప్రేక్షకులను అలరిస్తుందని, అక్కడ ఉన్న సెలబ్రెటీలతో ఈమె కొన్ని రకాల గేమ్‌ షోలు కండక్ట్‌ చేస్తుందనే టాక్‌ వచ్చింది. గతంలో హిందీ బిగ్‌బాస్‌ షోలో ఇలా జరిగింది. దాంతో తెలుగులో కూడా అనసూయ ప్రత్యేక అతిథిగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌ అవుతుందని అంతా భావించారు. అనసూయతో పాటు తేజస్వి మరియు మంచు లక్ష్మి కూడా ఎంటర్‌ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.

మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను అనసూయ కొట్టి పారేసింది. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాను అని, తన వద్ద బిగ్‌ బాస్‌ హౌస్‌కు వెళ్లేంత టైం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఒక్క మాటతో అనసూయ మొత్తం క్లారిటీ ఇచ్చేసింది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనసూయ అనే వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. త్వరలోనే బిగ్‌బాస్‌ షోలో తేజస్వి మరియు మంచు లక్ష్మిల ఎంట్రీ కూడా అనుమానమే అని తేలిపోయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న వారు తప్ప కొత్త వారు వెళ్లే అవకాశం లేదు. ముందు ముందు ఏమైనా జరగవచ్చు అని కొందరు ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. ఇంకా చాలా వారాలు ఉంది కనుక ఏం జరుగుతుందో చూద్దాం.

మరిన్ని వార్తలు:

సిట్ ముందుకు ఎవరెప్పుడు ?

న్యూడ్‌ సీన్స్‌లో న్యూడ్‌గా నటించలేదు