మోదీవి కక్ష సాధింపు చర్యలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు నరేంద్రమోదీ పాల్పడుతున్నారని, తమ పార్టీ అగ్రనేతలు అడిగిన ప్రశ్నలకు మోదీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే కుట్రతో ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు ఎంత అవినీతి చేసిన మాట్లాడకుండా, రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదని హితవు పలికారు.